Vinaro Bhaygyamu Vishnu katha into profits even before release: అసలు ఏమాత్రం సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం చేసిన కొన్ని సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కిరణ్ అబ్బవరం ప్రస్తుతానికి గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో వినరో భాగ్యము విష్ణు కథ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన టీజర్, ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్ రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ దక్కించుకోగా ఇటీవల విడుదల చేసిన దర్శన అనే సాంగ్ కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా సాగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్రేకప్ తర్వాత అందరూ విని ఆదరించేలా ఈ సాంగ్ ఉందని కూడా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఎస్ఆర్ కళ్యాణమండపం అని హిట్ సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం నుంచి ఎన్ని సినిమాలు వచ్చినా ప్రేక్షకులు ఆదరించలేదు. అయితే ఈ సినిమా కిరణ్ అబ్బవరం నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో అవన్నీ ఉండేలా ఉందని భావిస్తున్నారు. ఒకరకంగా చూసుకుంటే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ అంతటికీ ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు అదే ఇప్పుడు గీత ఆర్ట్స్ 2 బ్యానర్ కి బాగా కలిసి వచ్చిందని అంటున్నారు.


ఫిబ్రవరి నెలలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి సంబంధించి మిగతా అన్ని సినిమాల కంటే మంచి బజ్ ఉందని తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా విడుదలకు ముందే ప్రాఫిట్ జోన్ లోకి వెళ్ళిపోయిందని చెబుతున్నారు. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ సినిమాలో కాశ్మీర హీరోయిన్ గా నటించింది, మురళీ శర్మ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి మురళీకృష్ణ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు.


బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. కచ్చితంగా ఈ సినిమాతో మరో హిట్ అందుకుంటామని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ భావిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ సినిమాలు ఎక్కువగా బోల్తా పడుతూ వస్తున్నాయి. అయితే ఈ సినిమా మాత్రం విడుదలకు ముందే లాభాలు అందుకోవడంతో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ మంచి జోష్ మీద ఉంది.
Also Read; RC vs PK: మా వాడే ఒరిజినల్ గాంగ్ స్టర్ అని కొట్టుకుంటున్న చరణ్, పవన్ ఫాన్స్!


Also Read: Prabhas Fans Demand: మాకు అప్డేట్స్ కావాలి సార్.. ట్విట్టర్ ను కదిపేస్తున్న ప్రభాస్ ఫాన్స్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.